#19ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా
ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావాకాంక్షనీయుడా నీవే మా దేవ – కాపరి మా యేసు దేవా1. సాతాను శోధనలు మములాగుచున్నవి దేవా కష్టాలు కన్నీళ్ళు మా గుండె నిండెను దేవా లోకము మమ్ము పిలుచుచున్నది – శోకసముద్రం పొంగుచున్నది2. నీ ఆత్మ వరములను మాకిమ్ము మా యేసు దేవ నీ సేవ చేయుటకు మా శక్తి చాలదు దేవా సుఖము శరీరము కోరుచున్నది – మనస్సు ధనాశకు లాగుచున్నది3. మా ప్రియుడా నడుపుమయా – నీ ప్రేమ నీడలలోన పాలు గోధుమ సారములు ఉన్నాయి – నీ సన్నిధాన పాపపు చెలిమి పిలుచుచున్నది – చీకటి బలము లాగుచున్నది4. జీవజలాల ఊటలతో మా తోట తడుపుము దేవా తియ్యని తేనీయ మాటలతో మా నోరు నింపుము దేవా సుమమధుర సహవాసముతో సాగెద నిరతము నీ సేవలో

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.