#440ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
ఆనందముగా యెహోవా నీ కృపలన్నిఅన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)1. చావు గోతినుండి లేవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవదాతవివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయోసవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా||2. సింహపు పిల్లలు ఆకలిగొనిన – యెహోవ సహాయుడందరికిఇహమందున ఏ మేలు కొదువ యుండదుఅహా! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||3. ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపినకన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా||4. పర్వతంబులు పారిపోయినను – ఉర్విలో మార్పు కలిగిననూతరుణములు విరోధముగపై లేచినాస్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.