#152దేవునియందు నిరీక్షణ నుంచి
దేవునియందు నిరీక్షణ నుంచిఆయనను స్తుతించు నా ప్రాణమా (2)1. ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)2. చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)సత్యమగు – జీవమగు – మార్గమేసే (2)3. నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)ఆధారము – ఆదరణ – ఆయనలో (2)4. తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2)5. నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2)6. పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)కనికర – సంపన్నుడు – నా దేవుడు (2)7. స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.