#453ఎంతటి వాడను నేను యేసయ్యా
ఎంతటి వాడను నేను యేసయ్యాకొంతైనా యోగ్యుడను కానయ్యా (2)ఇంతగ నను హెచ్చించుటకుఈ స్థితిలో నన్నుంచుటకు (2) ||ఎంతటి||1. ఐశ్వర్యము గొప్పతనమునుకలిగించు దేవుడవీవేహెచ్చించువాడవునుబలమిచ్చువాడవు నీవే (2)అల్పుడను మంటి పురుగునునన్ను ప్రేమించినావుప్రాణమును నీ సర్వమునునా కొరకై అర్పించినావు ||ఎంతటి||2. నిను వెంబడించువారినినిజముగ సేవించువారినినీవుండే స్థలములలోనిలిచే నీ సేవకుని (2)ఎంతో ఘనపరచెదవుఆశీర్వదించెదవుశత్రువుల కంటె ఎత్తుగాఅతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||3. వినయముగల మనుష్యులనువర్ధిల్లజేసెదవుగర్విష్టుల గర్వమునణచిగద్దె నుండి దించెదవు (2)మాదు ఆశ్రయ దుర్గమామేమంతా నీ వారమేమా శైలము మా కేడెమామాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.