491

కొనియాడ దరమే నిన్ను

కొనియాడ దరమే నిన్నుకోమల హృదయ – కొనియాడ దరమే నిన్నుతనరారు దినకరు – బెను తారలను మించు (2)ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు 1. ఖెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు 2. సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు 3. విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)పశ్వాళితో దొట్టి – పండియుంటివి నీవు 4. దోసంబులను మడియు – దాసాళి గరుణించి (2)యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు 5. నరులయందున గరుణ – ధర సమాధానంబు (2)చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు 6. ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)శ్రేయముగ బవళించు – శ్రీకర వరసుత