#496కూడుకొని మనమీవేళ
కూడుకొని మనమీవేళఘనమగు వేడుకకు తెర తీయాలా (2)గడచిన దినముల కలిగిన సుఖముకైప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని||1. వేసవి వడగాలుల బాధ తీరిపోయేయేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయేవిదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయేవిమలమాయే హృదయ సీమ దిగులు లేదాయేగానమై గళమున పాడగాధ్యానమై మనసుని తాకగాప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని||2. పాతవి కడతేరగ మనసు మారిపోయేనూతన క్రియ చేయగ దారి సిద్ధమాయేప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయేసమసిపోయే శ్రమల జాడ జయము నాదాయేస్తోత్రమే నిలువుగ లేవగాధూపమై వరదుని చేరగాతిరిగొచ్చే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.