#255మహాత్ముడైన నా ప్రభు – విచిత్ర సిల్వజూడ నా
1. మహాత్ముడైన నా ప్రభు – విచిత్ర సిల్వజూడ నాఆస్తిన్ నష్టంబుగా నెంచి – గర్వంబణంగ ద్రొక్కుదున్2. నీ సిల్వగాక యోదేవా – దేనిన్ బ్రేమింపనీయకునన్నావరించు సర్వమున్ – నీ సిల్వకై త్యజింతును3. శిరంబు పాదహస్తమున్ – సూచించి దుఃఖ ప్రేమలుమరెన్నడైన గూడెనా – విషాద ప్రేమలీగతిన్4. ముండ్లన్ దుర్మార్గులల్లిన – కిరీట మేసు కుండినన్ఈ భూకిరీటములన్ని – దానిన్ దూరంగ జాలునే5. లోకంబు నే నర్పించినన్ – అయోగ్యమైన యీవియౌవింతైన యేసు ప్రేమకై – నా యావజ్జీవమిత్తును6. రక్షింపబడ్డ లోకమా – రక్షింప చావు పొందినరక్షకుడేసును సదా – రావంబు తోడ గొల్వుమా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.