#591మనసెరిగిన యేసయ్యా
మనసెరిగిన యేసయ్యామదిలోన జతగా నిలిచావు (2)హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసినీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన||నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకైసాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)సాహసక్రియలు చేయు నీ హస్తముతోనన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన||వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరిఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతోనన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2) ||మనసెరిగిన||మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకైప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2)నేలమంటితో నన్ను రూపించిన హస్తములేనన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.