#550నీ ప్రేమ నాలో మధురమైనది
నీ ప్రేమ నాలో మధురమైనదిఅది నా ఊహకందని క్షేమ శిఖరము (2)ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్నుపరవశించి నాలో మహిమపరతు నిన్నేసర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవుసత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ||చేరితి నిన్నే విరిగిన మనస్సుతోకాదనలేదే నా మనవులు నీవు (2)హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యంనిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)ఇది నీ బాహు బంధాల అనుబంధమాతేజోవిరాజా స్తుతి మహిమలు నీకేనా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||నా ప్రతి పదములో జీవము నీవేనా ప్రతి అడుగులో విజయము నీవే (2)ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదానీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును (2)ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమాతేజోవిరాజా స్తుతి మహిమలు నీకేనా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||నీ సింహాసనము నను చేర్చుటకుసిలువను మోయుట నేర్పించితివి (2)కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావుదయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు (2)ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమాతేజోవిరాజా స్తుతి మహిమలు నీకేనా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.