#207నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియునుశోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2)1. కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభుహల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)2. జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవుహల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)3. విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభుహల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.