#568పరలోకము నా దేశము
పరలోకము నా దేశముపరదేశి నేనిల మాయలోకమేగనేను యాత్రికుడను (2)ఎంతో అందమైనది పరలోకముఅసమానమైనది నా దేశము (2)ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము||దూతలు పాడుచుందురు పరమందునదీవా రాత్రమునందు పాడుచుందురు (2)పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము||రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము||అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్అగుపడుచున్నది గమ్యస్థానము (2)అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2) ||పరలోకము||నిత్యానందముండును పరమందుననీతి సమాధానము ఉండునచ్చట (2)పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2) ||పరలోకము||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.