#579ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.