#64ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు
ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు – ఏ మంచిలేని నన్ను నీవు కోరుకున్నావుఆ ప్రేమకు ఫలితం సిలువ త్యాగమా – ఆ ప్రేమకు అర్థం బలి దానమా1. నిన్నెరుగక ఆనాడు దూషించి తిరిగితినినీ మహిమను నే కానక అవమాన పరచితినినా కరములు నీవు వీడక కాపాడినది – ఈ దిన్ని ధన్యునిగా చేయాలనా2. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళలోదరిరాలేదెవ్వరూ నన్నాదరింపగనుఇలలో దొరకని ప్రేమను చూపించినది – నా స్వామీ నీ సాక్షిగా ఉండాలనా3. నా పాప కాడి క్రింద నలిగిపోతిని – కలువరిలో నా కొరకు కరిగిపోతివిఈ పాపిని పరిశుద్ధులలో చేర్చాలనా – పరమ పురికి నా నావ సాగాలనా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.