#265మార్పుచెందవా నీవు మార్పుచెందవా – నీ బ్రతుకు మార్చుకోవా
మార్పుచెందవా నీవు మార్పుచెందవా – నీ బ్రతుకు మార్చుకోవా (2)అనుకూల సమయం ఇదియేనని ఎరిగి – మారు మనసునూ పొందవా (2)1. ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని – ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి – తీర్పున్నది పై లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందు నీవు – నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా2. దిగంబరిగానే వచ్చావు నీవు – దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు -ఏదో ఒక దినమందున (2) నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు – నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు3. ఆత్మని కాక దేహాన్ని చంపే – మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే – దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు – నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే
Previous Songమార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
Next Songముఖ దర్శనం చాలయ్యా – నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.