#554నీతిగల యెహోవా స్తుతి
నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడిమీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతినిదాల్చుకొని సేవించుడి ||నీతి||చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగాసదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును ||నీతి||సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియుగర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను ||నీతి||గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతోపాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి ||నీతి||పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవునిపరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు ||నీతి||ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవునివెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి ||నీతి||ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రినిత్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే ||నీతి||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.