#279యేసయ్యా కనికరపూర్ణుడా – మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్యా కనికరపూర్ణుడా – మనోహర ప్రేమకు నిలయుడా (2)నీవే నా సంతోష గానము – సర్వ సంపదలకు ఆధారము (2)1. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2) సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2)2. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2) అలసిన వారి ఆశను తృప్తిపరచితివి అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)3. నీ వలన బలమునొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2) నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2)ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.